హైదరాబాద్‌లో తాగుబోతు డ్రైవర్స్ ఆగడాలు కొనసాగుతున్నాయి. కేవలం మగవారే కాదు, ఆడవాళ్లు కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. వారాంతం వస్తే చాలు పబ్బుల్లో పూటుగా మందుకొట్టి, రోడ్డెక్కుతున్నారు. అది కూడా వాహనాలు నడుపుకుంటూ. ఈ క్రమంలో మందు కొట్టి వాహనం నడిపే మందుబాబుల సంఖ్యను తగ్గించాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలీకృతం కావడంలేదు. గత రాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో డ్రైంకెన్ డ్రైవ్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ లో పోలీసులు పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మందు బాబులు అడ్డంగా బుక్కయ్యారు. మొత్తమ్మీద 22 కార్లు, 29 బైకులు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.. ఫుల్ గా మద్యం తాగిన ఓ మహిళ తన కారును ఇవ్వాలంటూ ప్రాధేయపడినా పోలీసులు కరుణించలేదు. ఆమె కారును సీజ్ చేసి, డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టారు.
అయితే అదే సమయంలో హీరో సాయిధరమ్ తేజ్ వెళ్తుండగా, ఆయనను పోలీసులు ఆపారు. అందరి మాదిరిగానే ఆయనకు కూడా బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించారు. అయితే టెస్టులో ‘0’ పాయింట్లు వచ్చాయి. దాంతో ఆయనను పోలీసులు పంపించేశారు.