మునగాకు కషాయం తాగితే?

27
- Advertisement -

మునగ చెట్టు గురించి తెలియని వారు ఉండరు. ఇందులోని ఆకులు, బెరడు, కాయలు, పూత.. ఇలా ప్రతి దాంట్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు యొక్క కాయలతో రుచికరంగా కర్రీ, పచ్చడి, వేపుడు.. ఇలా ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకొని అరగిస్తుంటాము. ఇంకా మునగ ఆకులను కూడా కొంతమంది కూరాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మునగ చెట్టులోని ప్రతిదీ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మునగ ఆకులను కషాయంలా చేసుకొని సేవించడం ద్వారా మహిళలకు ఎంతో మేలు కలుగుతుందట. రుతుక్రమ సమస్యలతో బాధ పడే మహిళలు మునగ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి కొద్దిగా తేనె కలుపుకుని తాగితే పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పి ఇతరత్రా రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇంకా శీతాకాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి, దగ్గు, వంటి సమస్యలు తలెత్తినప్పుడు మునగాకు రసానికి కొద్దిగా అల్లం రసం జోడించి సేవిస్తే ఆ సమస్యలు దూరమవుతాయట. ఇంకా పురుషులకు మేలు చేసే ఎన్నో పోషకాలు మునగాకులో మెండుగా ఉంటాయి. ఇందులో జింక్, ఐరన్, విటమిన్ డి, ఏ, ఏమైనో యాసిడ్స్, మినరల్స్..వంటి కొన్ని రకాల పోషకాలు పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయట. ఇంకా థైరాయిడ్ సమస్యలకు మునగాకు నేచురల్ మెడిసన్ గా పని చేస్తుందట. మునగాకు రసానికి కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గి మొఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా మునగాకు ను కషాయంలా సేవిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

Also Read:ఈ డ్రింక్స్ తాగితే ఎన్ని లాభాలో!

- Advertisement -