టాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. డ్రగ్స్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ ప్రారంభంకానుండగా ఇవాళ ఈడీ ముందుకు హాజరుకానున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ మేరకు 12 మంది నటీనటులకు ఈడీ నోటీసులు జారీచేసింది.
ఈ కేసుతో లింకులు ఉన్న మరికొందరిని విచారించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. అయితే, విదేశాలకు నిధులను ఎలా తరలించారనే విషయంపై ఈడీ విచారిస్తోంది.
ఇక సెప్టెంబర్ 2న నటి చార్మీ, సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న మరో హీరో రవితేజా, అతని డ్రైవర్ శ్రీనివాస్‌ను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్ 13వ తేదీన నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్ 15వ తేదీనా ముమైఖాన్, సెప్టెంబర్ 17వ తేదీన నటుడు తనీష్, సెప్టెంబర్ 20న హీరో నందు, సెప్టెంబర్ 22న హీరో తరుణ్‌ను ఈడీ విచారించనుంది.