కోవిడ్ టీకాల్లో రైల్వే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి..

126
B Vinod Kumar
- Advertisement -

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిత్యం ప్రజల మధ్య ఉండే రైల్వే ఉద్యోగులకు కోవిడ్ టీకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా, సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర శర్మ సమావేశమయ్యారు.

రైల్వే ఉద్యోగులకు కొవిడ్ వ్యాక్సిన్‌లను కేటాయింపు కోసం చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వినోద్ కుమార్‌ను కోరారు. సికింద్రాబాద్ సహా కాజీపేట, వికారాబాద్‌లలో వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆ రైల్వే అధికారులు తెలిపారు.ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ వారికి హామీనిచ్చారు.

- Advertisement -