‘దృశ్యం 2’ రిలీజ్ ఫిక్స్‌..

160
- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేష్‌ న‌టించిన ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దాంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘దృశ్యం-2’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ మీనా వెంకీ సరసన నటించారు.

అయితే ఇన్ని రోజులు ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక ఓటీటీలో విడుదలవుతుందా అనే విధంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 2’ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు వచ్చే నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమా టీజ‌ర్‌ను కూడా తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆరేళ్లుగా డిపార్ట్ మెంటును వేధిస్తోన్న ప్ర‌శ్న అంటూ ‘దృశ్యం’లోని హ‌త్య‌ కేసును ‘దృశ్యం-2’లోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఈ టీజ‌ర్‌లో చూపించారు. ‘ఒరేయ్ చంటి, ఆయ‌న కేసు ఏటి అయినాదిరా? రాంబాబు కేసు ఏటైనాది స‌ర్?’ అంటూ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్న‌ట్లు డైలాగులు వినిపించారు. ‘రాంబాబు అంటే వ‌రుణ్ కేసులో..’ అంటూ పోలీసు అధికారి అంటాడు. అందుకు కానిస్టేబుల్ స్పందిస్తూ ‘అవును స‌ర్ అత‌డే’ అని చెబుతాడు.

టీజ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠనింపే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు ఈ కేసును పోలీసులు ఛేదిస్తారా? ఈ సినిమాలోనూ కేసు నుంచి వెంక‌టేశ్ కుటుంబం త‌ప్పించుకుంటుందా? అన్న ఆస‌క్తిని ప్రేక్ష‌కుల్లో నింపారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు.

- Advertisement -