మట్టి కుండలో నీళ్ళు తాగితే.. ఎన్ని లాభాలో!

39
- Advertisement -

సాధారణంగా మట్టి కుండలలో నీళ్ళు తాగడం గ్రామీణ ప్రాంతాలలో చూస్తూ ఉంటాము. ఈ వేసవిలో ఎక్కడ చూసిన చలివేంద్రలు ఏర్పాటు చేసి మట్టికుండలలో నీటిని ప్రజలకు ఉచితంగా ఇస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలల్లోని ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఈ మట్టి కుండలలోని నీటినే ఎక్కువగా తాగుతుంటారు. అయితే కొంతమంది మాత్రం మట్టికుండలలోని నీటిని తాగడానికి ఇష్టపడరు. అయితే వాటిలోని నీరు త్రాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా తాగుతారు మరి అవేంటో చూద్దాం.

Also Read:కీళ్ళ నొప్పులు తగ్గడానికి..!

విపరీతమైన ఎండల కారణంగా తరచూ దాహం వేస్తూ ఉంటుంది. ఫ్రీడ్జ్ వాటర్ లేదా కూలింగ్ చేసిన నీరు త్రాగితే అప్పటికప్పుడు దాహం తీరినప్పటికి మళ్ళీ కొద్దిసేపటికే దాహం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మట్టికుండ నీళ్ళు త్రాగితే.. వెంటవెంటనే దాహం వేయకుండా బాడీలో నీటి శాతాన్ని అలాగే ఉంచుతుంది. ఎందుకంటే మట్టికుండలో ఉండే లవణాలు, మినరల్స్, సాల్ట్స్ వంటివి మనం తాగే నీటిలో కలిసి సహజసిద్దమైన ఎనర్జీని మన శరీరానికి అందిస్తాయి. అందువల్ల ఈ డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. ఇంకా మట్టి కుండలో నీళ్ళు తాగడం వల్ల వేసవిలో తరచూ వేదించే జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట.

Also Read:ఇకపై సినిమాల్లో నటించను:స్టాలిన్

ఎందుకంటే మట్టి కుండలో ఉండే లవణాల కారణంగా శరీరానికి ఆమ్లశాతం సరిగ్గా అందుతుంది. అలాగే పిహెచ్ శాతం కూడా సమతుల్యంగా ఉంటుంది తద్వారా జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. ఇక మట్టికుండాలో ఉండే సహజసిద్దమైన మినరల్స్ కారణంగా శరీరానికి సహజసిద్దంగా ఇమ్యూనిటీ లభిస్తుంది. అందుకే జలుబు, దగ్గు, ఆస్తమాతో బడపడే వాళ్ళు తప్పనిసరిగా మట్టికుండలో నీళ్ళు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక వడదెబ్బ బారిన పడిన వాళ్ళు బాటిల్ లోని నీటిని తాగడం కన్నా.. మట్టి కుండలోని నీళ్ళు తాగితే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో ఫ్రీడ్జ్ వాటర్, కూలింగ్ వాటర్ తాగడం బదులు మట్టి కుండలో నీటిని తాగితే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నా మాట.

- Advertisement -