బీజేపీ – టీడీపీ కలయిక.. సాధ్యమేనా?

38
- Advertisement -

బీజేపీ టీడీపీ మద్య పొత్తు కుదిరే అవకాశం ఉందా ? మొన్నటి వరకు టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందా ? ఇంతకీ ఈ రెండు పార్టీలు కలిస్తే ఎవరికి లాభం ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఖాయమే అనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల డిల్లీ వెళ్ళిన చంద్రబాబు అక్కడ అమిత్ షా తో బేటీ అయ్యారు. ఈ బేటీలో పొత్తుకు సంబంధించిన చర్చే జరిగి ఉంటుందనేది కొందరి భావన. అయితే గత ఎన్నికల తరువాత నుంచి బీజేపీ టీడీపీ మద్య దూరం పెరిగింది.

టీడీపీ తో కలిసేందుకు ససేమిరా అంటున్నారు కమలనాథులు. అయితే కర్నాటక ఫలితాలతో కేంద్ర బీజేపీలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. ఏపీలో సత్తా చాటలంటే టీడీపీతో కలవడమే ఉత్తమం అనే ఆలోచనకు బీజేపీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన కూడా ఆలోచనలో ఉండి టీడీపీకి దగ్గరైంది. దాంతో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా టీడీపీతో తప్పక కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుత ఏపీ పాలిటిక్స్ ను చూస్తే 2014 కూటమి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ బీజేపీ టీడీపీతో కలిస్తే.. ఈ దోస్తీ ఏపీ వరకే పరిమితం అవుతుందా లేదా తెలంగాణకు కూడా వ్యాపిస్తుందా అంటే.. ఏదైనా జరగవచ్చు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

Also Read:Haritha Telangana:కేటీఆర్ హర్షం

ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ కొంత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో అధికారం కోసం తహతహలాడుతోంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ కొన్ని నియోజిక వర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల టీడీపీని కలుపుకొని పోటీ చేస్తే బీజేపీకి కొంత ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో బీజేపీతో కలవడానికి టీడీపీ సిద్దంగా ఉంటుందా లేదా అనేది సందేహమే. అయితే ఏపీలో బీజేపీతో కలవాలంటే టీడీపీకి కమలనాథులు కండిషన్స్ అప్లై చేసే అవకాశం ఉంది. ఆ కండిషన్స్ లో తెలంగాణలో కూడా మద్దతు కోరే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఈ రెండు పార్టీల మద్య జరుగుతున్నా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పొత్తు కన్ఫర్మ్ అనే వాదన నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్..

- Advertisement -