భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము( Droupadi Murmu) నేడు, రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 4.40 గంటలకు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ డేగా (INS Dega)కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. అక్కడ రాష్ట్ర గవర్నర్, ఉపముఖ్యమంత్రి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు విశాఖలో జరుగనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR – International Fleet Review) కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళంతో పాటు పలు దేశాల నౌకాదళ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం, నౌకాదళ శక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిమితులు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రేపు మధ్యాహ్నం రాష్ట్రపతి విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటన విశాఖకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకురానుందని అధికారులు తెలిపారు.

