భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ నెల 25న ఉదయం 10.14 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.
()ఆదివారం ఉదయం 9:17 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన అపార్ట్‌మెంట్ నుండి కమిటీ కార్యాలయం అయిన కావేరీకి బయలుదేరుతారు.
()ఉదయం 9:22గంటలకు రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము నార్త్ కోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ఎయిడ్ డీ క్యాంప్ (ADC) రాష్ట్రపతికి అందజేసి కావేరీకి తోడ్కొని వెళ్తారు. అక్కడ కోవింద్ ఆమెకు స్వాగతం పలుకుతారు.
() ఉదయం 10:03గంటలకు రామ్‌నాథ్ కోవిద్, ద్రౌపది ముర్ము వాహన శ్రేణిలో పార్లమెంట్ హౌస్‌కు చేరుకుంటారు. పార్లమెంట్ గేట్ నంబర్ 5 వద్ద వారికి రాజ్యసభ చైర్‌పర్సన్, లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి స్వాగతం పలుకుతారు.
()ఉదయం 10:05గంటలకు ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు వెళ్తారు.
()ఉదయం 10:14గంటలకు నూతన రాష్ట్రపతికి సీజేఐ ప్రమాణ స్వీకార పత్రాన్ని అందజేస్తారు. ఉదయం 10:14: ద్రౌపది ముర్ము భారత ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
()ఉదయం 10:23 గంటలకు నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు.10:35 గంటలకు వేడుకను ముగించాలన్న హోం సెక్రటరీ అభ్యర్థనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.