పీవీ రాజేశ్వరరావు కన్నుమూత

281
Dr. P.V Rajeshwar Rao
- Advertisement -

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు, మాజీ ఎంపి, పీవీ రాజేశ్వరరావు(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని సోమాజీగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.

రాజేశ్వర రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. రాజకీయ, సాహిత్య, సంగీత రంగాల్లో అభిరుచి, ఆసక్తి కలిగిన రాజేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. రాజేశ్వర రావు కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం భగవంతుణ్ని ప్రార్థించారు.

- Advertisement -