ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా బాల లతా మేడం గారి పుట్టినరోజు పురస్కరించుకుని మేడం సమక్షం లో డా.మార్కండేయులు ఆధ్వర్యంలో బృoదం మొక్కలు నాటారు.
బాల లతా మేడం గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని , గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని డా.మార్కండేయులు అన్నారు.ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మలవరపు బాల లతా మేడం ( CSB IAS Academy Managing director & Rank-399 in (2004),
Rank-167(2016) in UPSC ) మరియు వెంగోపాల్ గారు (సెట్విన్ MD), సురేష్ గారు(Group1officer గ్రూప్ వన్ ఆఫీసర్ & సెట్విన్ అకౌంట్స్ అధికారి) ,శ్రీజ గారు (AIR Rank – 20 in 2020) ,ప్రశాంత్ గారు (AIR Rank – 498 in 2020) మరియు ర్యాంకర్లు , విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.