జెస్సీ పుణ్యామా..ఈ వారం అంతా సేఫ్!

90
jessi
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ..10వ వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ వారం నామినేషన్స్‌లో సిరి,రవి,కాజల్,సన్నీ, మాసన్ ఉండగా జెస్సీ పుణ్యమాని వీరింతా సేఫ్ కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అనారోగ్య కారణాలతో బయటికొచ్చి సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీ ఆరోగ్యం కుదుటపడలేదు. జెస్సీ సైతం తన బాధను చెబుతూ తనను బయటకు పంపాలని కోరారు.

దీంతో ఈ వారం అతన్ని బయటకు పంపేసి, ఇక ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవచ్చునని తెలుస్తోంది. లాస్ట్ సీజన్ లోనూ ఇలానే నోయల్ అనారోగ్యానికి గురైనప్పుడు అర్థాంతరంగా అతన్ని వైద్యం కోసం బయటకు పంపి, ఆ తర్వాత రెండు రోజులకే శాశ్వతంగా షో నుండి పంపేశారు. సేమ్ సీన్ ఇప్పుడూ రిపీట్ కానుంది.

ఇక వచ్చేవారం ఇంటి కెప్టెన్‌గా రవి ఎంపికైన సంగతి తెలిసిందే.

- Advertisement -