టీకా డోసుల మధ్య టైం పెంపుతో ముప్పే..!

217
fauci
- Advertisement -

దేశంలో ఫస్ట్, సెకండ్ డోస్ మధ్య విరామ సమయం పెంపుతో ముప్పేనని తెలిపారు ప్రముఖ అంటు వ్యాధుల నిపుణులు ఆంథోని ఫౌసీ. బ్రిటన్‌లో విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడ్డారని గుర్తుచేశారు.

ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డెల్టా వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా ప్రజలకు టీకాలు వేయాలన్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్‌ బలంగా ఉందని గుర్తు చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్‌,మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్‌ కీలకమని వివరించారు.

దేశంలో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు.. ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. గతంలో వ్యాక్సిన్‌ తీసుకున్న 28 రోజుల్లో సెకండ్ డోస్ ఉండగా క్రమక్రమంగా దానిని పెంచుతూ వచ్చారు.

- Advertisement -