పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ తో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ కాకుండా హరీష్ శంకర్ తో ఒకటి , సుజీత్ తో మరొకటి లైన్లో ఉన్నాయి. వీటి ఓపెనింగ్స్ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి పవన్ తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘వినోదాయ సీతమ్’ అనే సినిమా చేయబోతున్నాడు.
సముద్రఖని డైరెక్టర్ గా త్రివిక్రమ్ రచనతో తెరకెక్కనున్న ఈ సినిమాకు షూటింగ్ ముహూర్తం పెట్టేశారు. ఈ నెలాఖరున షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఓపెనింగ్ కార్యక్రమం లేకుండానే సైలెంట్ గా షూటింగ్ చేసే పనిలో ఉన్నారు. పవన్ నుండి ఈ ఏడాది హరి హర వీరమల్లు ఒక్కటే వస్తుందని ఊహించిన ఫ్యాన్స్ కి ఈ రీమేక్ రూపం లో మరో గిఫ్ట్ అందనుంది.
హరి హర వీరమల్లు కంటే ముందే వినోదాయ సీతమ్ వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. క్రిష్ సినిమాకు ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ లోపు రీమేక్ సినిమాను కంప్లీట్ చేసేసి పవన్ వీరమల్లు కి షిఫ్ట్ అవుతాడు. ఈ సినిమాలో పవన్ తో కలిసి నటించబోతున్నాడు సాయి ధరం తేజ్. ఈ సినిమాకు కేవలం ఇరవై రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడట పవర్ స్టార్. ముందుగా పవన్ సీన్స్ అన్నీ తీసేసి మిగిలింది తర్వాత ఘాట్ చేసే ప్లాన్ లో ఉన్నారు యూనిట్. సో పాన్ ఇండియా మూవీ కంటే ముందే ఓ రీమేక్ తో పవన్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. అంటే ఈ ఏడాది పవన్ నుండి రెండు సినిమాలు రానున్నాయన్నమాట.
ఇవి కూడా చదవండి..