Talasani:లక్కీ డ్రాతో పేదలకు సొంతిల్లు

37
- Advertisement -

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు.వచ్చే నెలలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని వెల్లడించారు తలసాని. పేదల సొంతిల్లు కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని… పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మొద్దని సూచించిన తలసాని..హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా 12 వేల మందికి ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌ డ్రా తీస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్‌ 2న కుత్బుల్లాపూర్‌లో ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు.

Also Read:అల్లు అర్హ అడుగులు అటు వైపే

- Advertisement -