KTR:ఆగస్టు 15 నుండి డబుల్‌ బెడ్రూం ఇండ్లు పంపిణీ

32
- Advertisement -

రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని…తిరిగి సీఎంగా కేసీఆర్ ఎన్నికవుతారని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో జీవో నెం.118 కింద రెగ్యులరైజ్‌ చేసిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…కేసీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్నెల్ల పాటు రాజకీయాలు చేస్తే చాలని.. మిగతా నాలుగున్నరేండ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలన్నారు. నగరంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు లక్ష పూర్తయ్యాయని…ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.

Also Read:పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ

రానున్న 50 నుంచి వందేండ్లలో ఎంత అభివృద్ధి జరిగినా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ 159 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు నిర్మించాలని నిర్ణయించామని… ఓఆర్‌ఆర్‌ నిర్మించినప్పుడే మెట్రో కోసం స్థలం కేటాయించారు కాబట్టి ఎలాంటి భూసేకరణ పనులు లేకుండా తక్కువ ఖర్చుతోనే ఈ మెట్రో నిర్మాణం చేయొచ్చన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ తరహాలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ( టిమ్స్‌ ) పెట్టి నగరానికి నాలుగువైపులా ఒక్కో చోట 2వేల పడకలతో ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు.

Also Read:బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య!

- Advertisement -