“దొరసాని” ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు..

443
Dorasani
- Advertisement -

హీరో రాజశేఖర్ కూతరు శివాత్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా దొరసాని. ఈసినిమాలో శివాత్మిక కు జోడిగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించాడు. ఈచిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించగా సురేష్ బాబు నిర్మాస్తున్నారు. ఓ సాధారణ కుటుంబానికి చెందిన అబ్బాయికి .. దొరవారి కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈసినిమాను తెరకెక్కించారు.

ఈచిత్రం నుంచి ఇటివలే టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ట్రైలర్ పై భారీ అంచనాలున్నాయి. ఈచిత్ర ట్రైలర్ ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా వచ్చేనెల 1వ తేదీన ఉదయం 10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది.

- Advertisement -