సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’.డాక్టర్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటించగా తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. టీజర్,ట్రైలర్‌లతో అంచనాలు పెరిగిపోగా తొలిమూవీతోనే ఆనంద్-శివాత్మిక ఎలాంటి మ్యాజిక్ చేశారు..?సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా చూద్దాం.
కథ:
ప్రేమకథతో సినిమా మొదలవుతుంది. దొరసాని కూతురు దేవకి(శివాత్మిక)ను తక్కువ కులం వాడైన రాజు(ఆనంద్ దేవరకొండ) ప్రేమిస్తారు. వారి ప్రేమకు స్నేహితులు సహకరించడం,పెద్దలు వ్యతిరేకించడంతో సినిమా మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న కష్టాలు ఏంటీ….?ఆ కాలంలో ప్రేమిస్తే ఏం చేసేవారు…?చివరికి రాజు…దేవకిని సొంతం చేసుకున్నాడా లేదా తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,సంగీతం,నటీనటులు. తొలి సినిమానే అయినా ఆనంద్ దేవరకొండ తన నటనతో ఆకట్టుకున్నారు. తెలంగాణ స్లాంగ్‌లో ఆనంద్ చెప్పిన డైలాగ్‌లు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తాయి. ఇక రాజశేఖర్ కూతురు శివాత్మిక తొలి సినిమాతోనే అదరగొట్టింది. తెరపై ఆనంద్-శివాత్మిక కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. కొత్తవాళ్లతో దర్శకుడు మహీంద్ర చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు అందించారు. ఇక మిగితా నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సూపర్బ్.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ కొన్ని అనవసరమైన సన్నివేశాలు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. ఓ పిరియాడిక్ లవ్ స్టోరీని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించడంలో దర్శకుడు మహీంద్రా వందశాతం సక్సెస్ అయ్యారు. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాడు. ఇక సినిమాకు మరో ప్లస్ పాయింట్ సంగీతం,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ బాగుంది. పాతకాలం సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ సూపర్బ్. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథే దొరసాని. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా సెట్‌లు, లొకేషన్లు, సహజసిద్ధమైన మేకప్ అన్నీ సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లాయి. దర్శకుడు మహేంద్ర ఒక నిజాయతీ కలిగిన ప్రేమకథను తెరకెక్కించారు. మొత్తంగా ఈ వీకెండ్‌లో అందరూ కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా దొరసాని.
విడుదల తేదీ: 12/07/2019
రేటింగ్:3/5
నటీనటులు:ఆనంద్ దేవరకొండ,శివాత్మిక
సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
దర్శకుడు:కేవీఆర్ మహేంద్ర