దొరసాని సెన్సార్ పూర్తీ..సినిమా ఎలా ఉందంటే?

462
Dorasani-Censor
- Advertisement -

శివాత్మిక రాజశేఖర్ ,ఆనంద్ దేవరకొండ జంటగా నటించిన సినిమా దొరసాని. కేవీఆర్ మహేంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహించగా..మధుర ఎంటర్టైన్ మెంట్ సంస్ధ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజై సూపర్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈమూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

ఈసినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది. పక్కా తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈసినిమాపై భారీగానే అంచనాలున్నాయి. మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించాయి. సెన్సార్ సభ్యుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విజయంపై ధీమాగా ఉన్నామని.. సినిమా విడుదలైన తర్వాత కూడా ఆనంద్, శివాత్మికల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చిత్రయూనిట్ ప్రకటించింది.

- Advertisement -