డోర ఆడియో రిలీజ్..

220
Dora Movie Audio Release
- Advertisement -

ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెరిన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ – “న‌య‌న‌తార న‌ట‌న‌కు పెట్టింది పేరు. సౌతిండియాలోనే వ‌న్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌. సినిమా ఆక‌ట్టుకునేలా ఉంటుంది. తెలుగు, త‌మిళంలో సినిమాను ఒకేసారి విడుదల చేస్తున్నాం. త‌మిళ నిర్మాత జ‌బ‌ర్‌గారికి థాంక్స్‌. తెలుగులో మ్యూజిక్ విష‌యంలో య‌శోకృష్ణ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. మ‌యూరి సినిమాలా ఈ సినిమాతో న‌య‌న‌తార aమ‌రో స‌క్సెస్ కొడుతుంది. సుర‌క్ష్ బ్యాన‌ర్‌లో సింగం3 త‌ర్వాత గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది“ అన్నారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ – “సూర్య వ‌ర్సెస్ సూర్య‌, శౌర్య‌, సింగం3, ఇప్పుడు డోర ఇలా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్న నిర్మాణ సంస్థ సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శివకుమార్‌గారు చేస్తూ వ‌చ్చారు. పాట‌లు మ‌ళ్ళీ వినాల‌నుకునేలా, అర్థవంతంగా, ట్రెండీగా ఉన్నాయి. య‌శోకృష్ణ‌గారు తెలుగులో బ్యాకింగ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు జి.అశోక్ మాట్లాడుతూ – “కారుతో లింక్ అయిన హార్ర‌ర్ అయిన స్టోరీ అంటేనే డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. మాయ చిత్రంతో మాయ చేసిన న‌య‌న‌తార డోర‌తో స‌క్సెస్ సాధిస్తుంది. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ శివ‌కుమార్‌గారు సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నారంటేనే సినిమా స‌క్సెస్ అయిన‌ట్లే. మంచి క‌థ ఉండ‌బ‌ట్టే ద‌ర్శ‌కుడు దాస్‌గారితో సినిమా చేయ‌డానికి న‌య‌న‌తార ఒప్పుకుంది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ – “వివేక్ సంగీతం అందించిన పాట‌ల‌న్నీ బావున్నాయి. శివ‌కుమార్‌గారు డోర‌తో మ‌రో స‌క్సెస్ కొట్ట‌డం గ్యారంటీ“ అన్నారు. పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ మాట్లాడుతూ – “శివ‌కుమార్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో పాట రాయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకు వివేక్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. సినిమా శివ‌కుమార్‌గారికి మ‌రో స‌క్సెస్‌ను తెచ్చి పెడుతుంద‌ని భావిస్తూ ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

డైరెక్ట‌ర్ దాస్ మాట్లాడుతూ – “తమిళంలో ఆడియో వేడుక చేయ‌లేదు. అందుకే తెలుగు ఆడియో వేడుక‌లోనే నేను తొలిసారి స్టేజ్ ఎక్కుతున్నాను. నిర్మాత‌గారు అందించిన స‌పోర్ట్‌తోనే మంచి సినిమా తీయ‌గ‌లిగాం. ఈ నెల 31న సినిమా తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. మా సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

వివేక్, మెరిన్‌ మాట్లాడుతూ – “త‌మిళం, తెలుగులో మంచి సాహిత్యం కుదిరింది. రెండు భాష‌ల్లో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

- Advertisement -