- Advertisement -
అతి త్వరలో బీజేపీ దుకాణం ముసుకుంటుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పాట్నా నుంచి ఢిల్లీ టూర్‌కు బయలుదేరేటప్పుడు విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ బీజేపీని తేలిగ్గా తీసిపారేశారు. త్వరలో దుకాణం ముసుకుంటుదని… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నామారూపాల్లేకుండా చేస్తామని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రేపు ఢిల్లీలో నితీశ్‌కుమార్‌తో కలిసి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
- Advertisement -