గంజాయిపై ఉక్కు పాదం..జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి

75
ganjai
- Advertisement -

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు నల్లగొండ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, నకేరేకల్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం తెల్లవారుజామున నకిరేకల్ పీఎస్‌ పరిధిలోని నగేష్ హోటల్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగ… విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనంలో గంజాయి ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే (AP 39 MZ 8970) వాహనంలో గంజాయి ప్యాకెట్లు (60) స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

- Advertisement -