ఎన్నికల సమయంలో అపోహ వద్దని…తిరుగులేని మెజార్టీతో బీఆర్ఎస్‌కు విజయం తథ్యమన్నారు సీఎం కేసీఆర్. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొని రండి.. నెల రోజుల్లో చేర్యాల డివిజన్ చేసి పెడుతానని చెప్పారు.
మెడికల్ కాలేజీ వచ్చిందంటే నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు వస్తాయ్. వాటికి ఇబ్బంది లేదు వస్తాయ్ అన్నారు. జనగామను యాది చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితి, కండ్లకు నీళ్లచ్చే పరిస్థితి. ఉద్యమం జరిగే సమయంలో అన్ని జిల్లాలు, అన్ని మండలాలు తిరిగినా అని చెప్పారు. సూర్యాపేట వెళ్తున్న సమయంలో బచ్చన్నపేటలో మాట్లాడి వెళ్లాలని పలువురు కోరారు. అక్కడ ఆగి జీపులో మాట్లాడాను. అక్కడ అందరూ ముసలివారే ఉన్నారు. ఒక్క యువకుడు లేడు. ఎనిమిదేళ్ల కరువుతో బచ్చన్నపేట చెరువు అడుగంటిందన్నారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చెప్పారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో ఒకటి, రెండు ఎకానమిక్స్ గ్రోత్ సెంటర్స్ కావాలని చెబితే.. వేరే ప్రదేశాలు చెప్పారు. నేను నా పాయింట్ పెట్టి జనగామ పాయింట్ పెట్టాను. రెండోది భువనగిరిపై పెట్టాను. ఈ రెండు గ్రోత్ కారిడార్లు అయ్యాయి. ఈ రోజు నీళ్లు వచ్చిన తర్వాత జనగామలో పాత వరంగల్ జిల్లాలో మొత్తంగా చూస్తే అత్యధికంగా వడ్లు దని చెప్పారు.
Also Read:KCR:కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయండి