KCR:కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయండి

32
- Advertisement -

కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…ఎన్నికల సమయంలో ఆగంఆగం కావొద్దన్నారు. సుస్థిర పాలన అందించే బీఆర్ఎస్‌కు మరోసారి పట్టం కట్టాలన్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌ను గెలిపించిన వెంటనే జనగాం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానని తెలిపారు. ఎన్నికల ముగింపు సభ చేర్యాలలో నిర్వహిస్తామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని…. మీరు సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

మల్లన్నసాగర్ నుంచి మరికొన్ని లిఫ్టులతో నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు హక్కుల కోసం పోరాడుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగనివ్వనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తామని అంటోందని…ఆ పార్టీని బంగాళాఖాతంలో తొక్కాలన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు దగ్గరి మిత్రుడని…ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే జనగామకు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ గంగా జమునా తెహజీబ్ అని…కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు.

Also Read:నడుంనొప్పితో బాధపడుతున్నారా?

- Advertisement -