రాత్రి పడుకునే ముందు ఇవి తింటే.. అంతే సంగతులు !

21
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా నిర్విరామంగా పని చేస్తూ సరైన సమయంలో ఆహారం తినడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు చాలమంది. అయితే పగలు ఆహారంపై శ్రద్ద లేకపోయిన రాత్రి వేళ మాత్రం ఫుల్లుగా ఆహారాన్ని ఆరగించి సంతృప్తి చెందుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రివేళ విశ్రాంతి సమయం కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా రాత్రిపూట అమితంగా ఆహారాన్ని తీసుకోవడం కూడా ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. అంతేకాకుండా రాత్రివేళ కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండకపోతే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. కాబట్టి రాత్రివేళ తినకూడని ఆహార పదార్థాలేవో.. వాటివల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.

చాలమందికి రాత్రిపూట భోజనం చేసిన తరువాత తీపి పదార్థాలు తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా రాత్రివేళ స్వీట్స్ తినడం అసలు మంచిది కాదట. స్వీట్స్ లో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల ధీర్ఘకాలిక డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ డయాబెటిస్ ఉన్న వాళ్ళు నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కొవ్వుతో పాటు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఇక రాత్రిపూట కాఫీ తాగే అలవాటు కూడా చాలమందికి ఉంటుంది..

ఇలా కాఫీ తాగడం కూడా అసలు మంచిది కాదట. ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇంకా టమాటో, ఉల్లిపాయ వంటివి కూడా రాత్రిపూట తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. టమాటో, ఉల్లిపాయలలో ఉండే యాసిడ్స్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తాయి. అందుకే రాత్రిపూట ఉల్లిపాయ, టమాటో వంటివి తినడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట కూల్ డ్రింక్స్ వంటివి కూడా సేవించరాదు. కూల్ డ్రింక్స్ వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. అందువల్ల రాత్రి పడుకునే ముందు వీటన్నిటికి వీలైనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -