ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా పని ఒత్తిడిలో పడి చాలా అలసిపోతుంటాము. సాయంత్రానికి ఎంతో టైడ్ గా ఇంటికి చేరుకొని కొద్ది సేపుసేద తీరి డిన్నర్ చేసి నైట్ హాయిగా నిద్ర పోవాలని అనుకుంటాము. కానీ మనం భావించినట్లుగా హాయిగా నిద్ర పోవడం అంతా తేలికైన విషయం కాదు. మనం, చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా సరైన నిద్ర లేక నిద్రలేమితో భాదపడుతుంటారు చాలమంది. రాత్రివేల నిద్ర పట్టకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం !
1. నీరు త్రాగడం
కొందరికి పడుకునే ముందు నీరు త్రాగే అలవాటు ఉంటుంది. ఇలా నీరు త్రాగడం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు నీరు త్రాగడం వల్ల బ్రెయిన్ మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. తద్వారా నిద్ర కు భంగం వాటిల్లుతుంది. కాబట్టి వీలైనంతవరకు పడుకునే ముందు నీరు త్రాగడం మనుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
2. కాఫీ లేదా టీ త్రాగడం
సాధారణంగా అలసిపోయినప్పుడు కాఫీ లేదా టీ తాగుతూ ఉంటాము. ఇలా తాగడం వల్ల శరీరంలోని ఆర్గాన్స్ మళ్ళీ ఉత్తేజంగా మరి అలసట దురమౌతుంది. కానీ కొందరికి ఇందుకు భిన్నంగా శరీరానికి రెస్ట్ ఇవ్వాలవలసిన నిద్రపోయే టైమ్ లో టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల నిద్రలేమి సమస్యతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:పిక్ టాక్ : ఉఫ్.. సొగసుల విధ్వంసం
3. మొబైల్ చూడడం లేదా టీవి చూడడం
కొందరికి పడుకునే టప్పుడు మొబైల్ లేదా టీవి చూసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొబైల్ స్క్రీన్ లైట్ కళ్ళకు నేరుగా పడుతుంది. తద్వారా కళ్ల మంట ఏర్పడుతుంది. ఇది నిద్ర లేమికి కూడా దారి తీస్తుంది.
కాబట్టి సుఖనిద్ర ను కోరుకునే వారు పై మూడు అలవాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్ర అనేది చాలా ముఖ్యం. ఎంత హాయిగా నిద్రపోతే మరుసటి రోజు అంతే ఉత్సాహంగా రోజంతా గడపగలం. రాత్రి నిద్రకు ఏమాత్రం భంగం కలిగిన మరుసటిరోజు బద్దకం, అలసట ఆవహించి సరిగా వర్క్ చేయలేము కాబట్టి నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
Also Read:ఆపరేషన్ చంద్రబాబు..జగన్ సక్సస్ అయ్యరా?