బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా తమ రోజువారీ ఆహార ఎంపికలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. బరువును నియంత్రించడంలో డైట్ అనేది ఒక ప్రాథమిక పునాది. అయితే స్థిరమైన బరువు నిర్వహణ కోసం జీవక్రియ , కేలరీల సమతుల్యత మరియు హార్మోన్ల మద్దతు కూడా అవసరం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2026 ప్రకారం.. మెరుగైన ఆరోగ్య ఫలితాల కోసం బరువు నియంత్రణను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడం అనేది ప్రస్తుతం ఒక ప్రధాన ప్రజారోగ్య అవసరంగా మారింది.
అంతేకాకుండా వరల్డ్ మెట్రిక్ రిపోర్ట్ 2026 ప్రకారం.. సుమారు 0.45 కిలోల కొవ్వును తగ్గించుకోవడానికి శరీరంలో 3,500 కేలరీల లోటు అవసరమవుతుంది. అంటే మనం చేసే చిన్న చిన్న డైట్ తప్పులు కూడా బరువు తగ్గే ప్రక్రియను అడ్డుకోగలవు. చాలా మందికి తాము చేసే కొన్ని పొరపాట్ల వల్లే బరువు తగ్గడానికి బదులు పెరుగుతున్నామనే విషయం తెలియదు. వయస్సు, ఎత్తుకు తగ్గ ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేస్తూ జీవనశైలి వ్యాధులను దరిచేరనీయకుండా ఉండాలంటే మన డైట్ విధానాన్ని సరిదిద్దుకోవాలి.
() కేలరీలను విపరీతంగా తగ్గించడం..త్వరగా బరువు తగ్గాలనే ఆరాటంతో చాలా మంది చేసే మొదటి తప్పు ఇది. స్వల్పకాలిక ఫలితాల కంటే బరువు నియంత్రణ అనేది దీర్ఘకాలికంగా సాగాలి. పరిశోధనల ప్రకారం.. కేలరీలను ఒక్కసారిగా విపరీతంగా తగ్గించడం వల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా ఇది శరీరాన్ని ఆకలి మోడ్ లోకి నెట్టివేస్తుంది, దీనివల్ల శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందవు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ప్రోటీన్లు, కార్బ్స్, మరియు గుడ్ ఫ్యాట్స్ (మంచి కొవ్వులు) ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
()ఉద్యోగ ఒత్తిడి వల్లనో లేదా ఆహారం అవసరం లేదనుకునో రోజువారీ భోజనాన్ని స్కిప్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల ఆ తర్వాత ఆకలి ఎక్కువై ఒకేసారి అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది రోజంతా బ్లడ్ షుగర్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’, ‘గ్రెలిన్’ హార్మోన్లు దీనివల్ల దెబ్బతింటాయి. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం ద్వారా బ్లడ్ షుగర్‌ను స్థిరంగా ఉంచవచ్చు. క్రమబద్ధమైన ఆహార సమయాలను పాటించడం వల్ల శరీర శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి.
()ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో చాలా మంది నట్స్ (జీడిపప్పు, బాదం వంటివి), స్మూతీస్, మరియు గ్రనోలా వంటి వాటిని ఎక్కువగా తింటారు. అయితే వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి . కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటి కంట్రోల్ లో ఉంచాలి. పోర్షన్ కంట్రోల్ పాటించడం ద్వారా పోషకాలు అందుతాయి మరియు కేలరీలు పరిమితిలో ఉంటాయి. ఆహార పదార్ధాలను కొనేముందు వాటి వెనుక ఉండే న్యూట్రిషన్ లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోవాలి.
AlsoRead:GIC:సుందర్‌బన్‌లో హరిత వికాసం
()హై-ప్రోటీన్ డైట్ బరువును అదుపులో ఉంచడానికి మరియు జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ తక్కువగా ఉంటే కండరాల నష్టం జరిగి కొవ్వు కరిగే ప్రక్రియ మందగిస్తుంది. ప్రతి పూట తినే ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, పప్పుధాన్యాలు (దాల్), పనీర్ మరియు లీన్ మీట్స్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి.
() ఒత్తిడి లేదా భావోద్వేగాల వల్ల నియంత్రణ లేకుండా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే ‘కార్టిసాల్’ హార్మోన్ వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. ఆఫీస్ ఒత్తిడి తర్వాత లేదా చదువుకునేటప్పుడు మైండ్ లేకుండా స్నాక్స్ తినే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవాలి.ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా లేదా నడక (వాకింగ్) వంటి వ్యాయామాలు చేయాలి.

