నెహ్రూ మ్యూజియంను ఎవరూ డిస్టర్బ్ చెయ్యొద్దు : మన్మోహన్‌

210
Don't disturb Nehru memorial
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీకి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ లేఖ రాశారు. నెహ్రూ స్మారక కేంద్రంలో ఇప్పటి వరకు దేశానికి ప్రధానిగా సేవలు చేసిన వారి జీవిత విశేషాలను పొందుపరచాలని ఇటీవల మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో మన్మోహన్‌ ఈ అంశంపై స్పందించారు. దేశరాజధాని ఢిల్లీలో ఉన్న నెహ్రూ మ్యూజియంను మార్చకూడదంటూ మన్మోహన్ సింగ్..ఆ లేఖలో ప్రస్థావించారు.

Manmohan-Singh-PM-Modi

తీన్‌మూర్తీ కాంప్లెక్స్‌లోని నెహ్రూ మ్యూజియం కాంగ్రెస్ పార్టీకి చెందినది కాదని, అది యావత్ దేశానికి చెందినదని మన్మోహన్ అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిచెందిన తర్వాత ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు మొదలుపెట్టడంతో మన్మోహన్‌ స్పందించి.. నెహ్రూ మ్యూజియంను ఎవరూ డిస్టర్బ్ చేయరాదని, భారత జాతి నిర్మాత, మొదటి ప్రధాని నెహ్రూ కోసం ఆ మ్యూజియంను అంకితం చేశామని, ఆయన గొప్పతనాన్ని శత్రువులు కూడా మెచ్చుకున్నారని, మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా నెహ్రూను కీర్తించారని తన లేఖలో మన్మోహన్ తెలిపారు.

- Advertisement -