తాను వేరే పార్టీలో చేరుతున్నానంటూ కొన్ని న్యూస్ చానెల్స్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని కోరారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని..
నేను బీఆర్ఎస్ పార్టీ ని ఎప్పటికీ వీడబోనని తేల్చి చెప్పారు.
ఉద్యమ కాలం నుండి గత 21 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుడిలా పని చేస్తున్నాను. అంచెలంచెలుగా ఎదుగుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా రాజకీయ గురువు బాపు సీఎం కేసీఆర్ అన్నారు. పదవుల కోసం పార్టీలు మారే సంస్కృతి నాది కాదని…. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కి, అలాగే మా పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి, కేసీఆర్ తెలంగాణకి హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు.
Also Read:చంద్రయాన్ 3 విజయంలో తెలంగాణ సైంటిస్ట్