Tirumala:అప్ డేట్

41
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,122 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

27 నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనుండగా ఈ 3 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Also Read:చంద్రయాన్ 3 విజయంలో తెలంగాణ సైంటిస్ట్

- Advertisement -