Bhumana:ఆపరేషన్ చిరుత కొనసాగిస్తాం

44
- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కోనసాగిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. రెడ్డి తెలిపారు . తిరుమల నడకదారిలో గురువారం చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో కలసి మాట్లాడిన భూమన…అటవీ శాఖ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తిరుమల అటవీ ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యచరణ రూపొందించి, అమలు చేస్తామన్నారు.భక్తులకు భధ్రత కల్పిస్తూనే, నడక మార్గం లోకి వచ్చే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. భక్తుల భద్రత లో భాగంగా అటవీ శాఖ సూచనల మేరకు అడవి లో 300 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

Also Read:బి‌ఆర్‌ఎస్ లోకి జగ్గారెడ్డి.. ఖాయమా?

భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషియల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

- Advertisement -