ఇవాంకా ట్రంప్ త్వరలో ఇండియాకు….

225
Donald Trump's Daughter to arrive in Hyderabad
- Advertisement -

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోదీ ఆహ్వానించిన మేర‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ త్వరలో ఇండియాకు రానున్నారు.

డొనాల్డ్ ట్రంప్ కు సలహాదారుగా ఉన్న ఇవాంక నవంబర్ 28న జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం.

 Donald Trump's Daughter to arrive in Hyderabad

ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హజరుకానున్నారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును ప్రారంభించగా.. ఈసారి ఎనిమిదో సదస్సు జరగనుంది. గత జూన్లో అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ భారత్‌లో ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇవాంక ట్రంప్‌ను కోరారు.

ఈ క్రమంలోనే త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు ఇవాంకా, మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. బిజినెస్ విమెన్‌గా, ఫ్యాష‌న్ మోడ‌ల్‌గా అమెరికాలో పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన ఇవాంకా ప్ర‌స్తుతం త‌న తండ్రికి అసిస్టెంట్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు.

రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ త‌న భ‌ర్త జేరెడ్ కుష్న‌ర్‌తో క‌లిసి ట్రంప్‌కి స‌ల‌హాలివ్వ‌డానికే ఆమె ప్రాధాన్య‌మిస్తారు.

 Donald Trump's Daughter to arrive in Hyderabad

ఇందుకోసం ఆమె గానీ, త‌న భ‌ర్త గానీ ఎలాంటి జీత‌భ‌త్యాలు తీసుకోవ‌డం లేదు. స్వ‌త‌హాగా ఆమెకు 300 మిలియ‌న్ల డాల‌ర్ల ఆస్తిపాస్తులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలాఉండగా..భారత్ లో తొలిసారిగా ఈ ఈవెంట్‌ జరగనుంది.

ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానున్నట్లు సమాచారం.

- Advertisement -