భారత్‌పై ట్రంప్ మరో బాంబ్..!

4
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు మరో బాంబ్ పేల్చేందుకు రెడీ అయ్యాడు. టారిఫ్స్ విషయంలో భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. భారత్‌పై టారిఫ్స్ భారీగా పెంచబోతున్నా అని హెచ్చరించాడు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ఆయిల్ కొనుగోలు చేయడమే కాదు, ఓపెన్ మార్కెట్ లో అధిక లాభాలకు అమ్ముకుంటోందని ట్రంప్ ఆరోపించారు.

రష్యన్ వార్ మెషిన్ వల్ల యుక్రెయిన్‌లో ఎంత మంది చనిపోతున్నారో వారు పట్టించుకోరు అని భారత్‌పై ఆరోపణలు చేశారు. రష్యా చమురు కొనుగోలు కారణంగా, భారత్ USA కి చెల్లించే సుంకాన్ని తాను గణనీయంగా పెంచుతాను అని ట్రంప్ హెచ్చరించారు.

దేశం ఇంధన కొనుగోళ్లు జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ శక్తులతో నడపబడుతున్నాయి. కాబట్టి భారత చమురు సంస్థలు రష్యన్ దిగుమతులను నిలిపివేయబోవు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:ECతో బీఆర్ఎస్ నేతల భేటీ..

- Advertisement -