అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లో భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రకటించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసిన తన తొలి ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వాణిజ్యం, సుంకాలపై కొంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం నిజమైనదే అని స్పష్టం చేశారు. నిజమైన స్నేహితులు విభేదాలు ఉన్నా చివరికి వాటిని పరిష్కరించుకుంటారని గోర్ వ్యాఖ్యానించారు.
నేను అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ప్రపంచం నలుమూలలా ప్రయాణించాను. ప్రధాని మోదీతో ఆయనకు ఉన్న స్నేహం నిజమైనదని నేను నిస్సందేహంగా చెప్పగలను. అమెరికా–భారత్ సంబంధాలు కేవలం ఉమ్మడి ప్రయోజనాలపైనే కాకుండా అత్యున్నత స్థాయిల్లో ఉన్న బలమైన సంబంధాలపై ఆధారపడి ఉన్నాయి. నిజమైన మిత్రులు విభేదించవచ్చు, కానీ చివరికి పరిష్కారం కనుగొంటారు. రాబోయే ఒకటి–రెండు సంవత్సరాల్లో అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు రావాలని నేను ఆశిస్తున్నాను అని గోర్ తెలిపారు.
అమెరికా నేతృత్వంలోని ప్యాక్స్‌సిలికా టెక్నాలజీ అలయెన్స్‌లో భారత్‌ను పూర్తి సభ్యుడిగా చేరేందుకు వచ్చే నెల ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రపంచ సెమీకండక్టర్, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నదని గోర్ పేర్కొన్నారు. ఇటీవల వాషింగ్టన్ డీసీలో కుదిరిన ప్యాక్స్‌సిలికా డిక్లరేషన్‌లో ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, ఇజ్రాయెల్ వంటి దేశాలు అమెరికాతో భాగస్వాములయ్యాయి. ఇది సురక్షిత సరఫరా గొలుసులు, సాంకేతిక పురోగతికి బలమైన బహుళజాతి వేదికగా మారనుంది.
Also Read;ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం

