Trump:అమెరికన్లకు స్వర్ణయుగమే

1
- Advertisement -

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్..తన గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని..అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. అమెరికన్లు అంతా గర్వించే సమయం ఇది అన్నారు.

2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు. డొనాల్డ్ ట్రంప్ విజయం పట్ల ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సరికొత్త రికార్డు సృష్టించించారు సుహాస్‌ సుబ్రమణ్యం. వర్జీనియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

Also Read:Vijayamma: జగన్‌పై తప్పుడు ప్రచారమా?

- Advertisement -