బైడెన్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు…

189
trump
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ ప్రత్యర్ధిగా జోసెఫ్ బైడెన్‌ అధికారికంగా కన్ఫామ్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు డోనాల్డ్ ట్రంప్.

బైడెన్ వామపక్షాల చేతిలో ఒక నిస్సహాయ కీలుబొమ్మ అని మండిపడ్డారు. ఓక్లాహోమాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ట్రంప్… బైడెన్‌ మద్దతుదారులు నేరస్తులకు సాయం చేసి, వారిని బెయిల్‌ మీద బయటకు తీసుకువస్తున్నారని ఆరోపించారు.

వారు హింసను ప్రోత్సహిస్తున్నారని, అమెరికా చరిత్రను ధ్వంసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే ఎన్నికల ప్రచారం, జనాదరణలో బిడెన్‌ కంటే ట్రంప్‌ కాస్త వెనుకబడ్డారు.

- Advertisement -