భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మోదీ ..నేను — పనులు పూర్తి చేసే నాయకులం. చాలా మందిపై ఇది చెప్పలేం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్–అమెరికా సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను భారత్‌లోని అమెరికా ఎంబసీ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇటీవల ఇద్దరు నాయకులు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంభాషణలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చించారు.
Also Read;దేశంలో లాక్‌డౌన్..ఖండించిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ మార్గం తెరిచి ఉండటం ఎంతో అవసరమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే సంకేతాలుగా భావిస్తున్నారు.

