గ్రేట్ వర్క్ ఇవాంకా..

166
- Advertisement -

ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న వైట్ హౌస్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప పని చేశావంటూ ఇవాంకాపై ఆకాశానికెత్తేశారు. గ్రేట్‌వర్క్ ఇవాంకా అంటూ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

Donald Trump Praises  Ivanaka
జిఈఎస్‌లో మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడిన విషయం తెలిసిందే.  మహిళా సమానత్వానికి పలు దేశాలు చట్టంలో మార్పులు తేవాలని సూచించారు.  పురుషాధిక్య సమాజంలో ఒక పారిశ్రామికవేత్తగా మహిళ రాణించాలంటే ఎంత వివక్ష, ఎన్ని కష్టాలు ఉంటాయో తనకు స్వీయానుభవమని అన్నారు. ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు లక్ష్య సాధనలో పారిశ్రామికవేత్తగా రాణించడం మహిళకు సవాలేనని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని మహిళలు అన్నిరంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు.

అంతేగాదు అమెరికాకు భారత్‌ చిరకాల మిత్రదేశమని తెలిపింది. అంతేగాదు భారతీయులు ఎప్పటికి మాకు స్పూర్తిగా నిలుస్తారని ఇవాంక పేర్కొంది. భారత్‌తో ధృడమైన బంధాన్ని డోనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని ఇవాంకా వ్యాఖ్యానించింది.

- Advertisement -