అఫ్గాన్‌తో యుద్ధం..పాక్‌పై ట్రంప్‌ ప్రశంసలు

4
- Advertisement -

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగుతున్న నేపథ్యంలో అవసరమైతే తాను జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే పాకిస్థాన్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

పాక్ ప్రధాని షాబాద్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ లను ప్రశంసిస్తూ, వారు గొప్ప నాయకులని పేర్కొన్నారు. వారిని తాను ఎంతో గౌరవిస్తానని, పాకిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతంగా రాణిస్తోందని అన్నారు.

అఫ్గాన్–పాక్ ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా వైఖరి ఏమిటన్నది గమనించాల్సిన అంశంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలతో దక్షిణాసియాలో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు రాజనీతిక చర్చలు అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Also Read:‘పెద్ది’..సెకండ్ సింగిల్ అప్‌డేట్!

- Advertisement -