- Advertisement -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను తిరిగి అమెరికాలో కొనసాగించడంపై చర్చ జరిగినట్లు ట్రూత్ ద్వారా వెల్లడించారు ట్రంప్.
అక్టోబర్‌లో సౌత్ కొరియాలో జరిగే APEC సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వాణిజ్యం, టిక్‌టాక్ అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే వచ్చే ఏడాది ప్రారంభంలో చైనాకు వెళ్తాను, అలాగే అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా తగిన సమయంలో అమెరికాకు వస్తారు. మేము మళ్లీ ఫోన్ ద్వారా మాట్లాడతాము..TikTok ఆమోదాన్ని అభినందిస్తున్నాము అని చెప్పారు ట్రంప్. అలాగే ఇద్దరం APECలో కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాము అని తెలిపారు.

- Advertisement -

