- Advertisement -
వచ్చే ఏడాది అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ట్రంప్..తన ఎజెండాను ప్రజలకు వివరిస్తున్నారు.
తాను అధికారంలో ఉన్నట్లయితే యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు ట్రంప్. మళ్లీ అధికారంలోకి వస్తే రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజే ఆపేస్తానని…యుద్ధాన్ని ముగించడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపగలమని తెలిపారు.
అయితే ట్రంప్ ప్రస్తుతం అనేక నేర విచారణలతో సహా అనేక విచారణలను ఎదుర్కొంటున్న విషయం విధితమే. యూఎస్ కాపిటల్ అల్లర్ల కేసు ట్రంప్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -