ఆపరేషన్ సింధూర్‌పై ట్రంప్

10
- Advertisement -

ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడిని నిర్వహించింది భారత్. ఈ మెరుపుదాడులతో పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

పహల్గాం దాడిని సిగ్గుచేటుగా ట్రంప్‌ అభివర్ణించారు. గతం ఆధారంగా ఏదో జరుగబోతోందని ప్రజలకు తెలుసునని అనుకుంటున్నానన్నారు. వారు (భారత్‌) చాలాకాలంగా పోరాడుతున్నారని.. దాని గురించి ఆలోచిస్తే వారు అనేక దశాబ్దాలు పోరాడుతున్నారన్నారు. ఇది చాలా త్వరగా ముగియాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు ట్రంప్.

భారత్‌ చర్యల తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశం-పాకిస్తాన్‌లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సీనియర్ అధికారులు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యాతో మాట్లాడింది. భారత సైన్యం తీసుకున్న చర్య గురించి వారికి వివరంగా తెలియజేసింది.

Also Read:మిస్ వరల్డ్ పోటీలు సర్వం సిద్ధం..

- Advertisement -