మిస్ వరల్డ్ పోటీలు సర్వం సిద్ధం..

17
- Advertisement -

మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో తెలగాణ వైభవం, చరిత్ర, ప్రగతి తెలిసే విధం గా టైమ్ లెస్ తెలగాణ పేరుతో వీడియో ప్రదర్శన నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ జడ్జి పానలిస్ట్ గా వ్యవహరించనున్నారు సోను సూద్.

ప్రెస్ మీట్ లో మంత్రి జూపల్లి, యాక్టర్ సోను సూద్,మిస్ ఇండియా నందిని గుత్తా, మిస్ వరల్డ్ సేవ్ జూలియా మార్లే తెలగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం అండ్ కల్చర్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

మే 7 నుంచి మే 31 వరకు 28 రోజుల పాటు ఈ బ్యూటీ ఫెస్టివల్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో జరగనుంది. ప్రారంభ కార్యక్రమం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ పోటీల కోసం ఇప్పటికే ప్రపంచ దేశాల సుందరీమణులు మహా నగరానికి చేరుకున్నారు. అందాల భామలతో హైదరాబాద్ నగరం వెలిగిపోతోంది.

ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ప్రఖ్యాతి గాంచిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. 71వ ఎడిషన్ న్యూఢిల్లీ, ముంబైల్లో ఘనంగా ముగిశాక, 72వ ఎడిషన్‌ను తెలంగాణలో నిర్వహించడం ఎంతో అదృష్టం. ఈ పోటీ కేవలం బ్యూటీ ఫార్మాట్‌ మాత్రమే కాదు, మానవతా విలువల్ని ప్రోత్సహించే వేదికగా కూడా నిలుస్తోంది. ‘బ్యూటీ విత్ పర్పస్‌’ అనే కాన్సెప్ట్ ద్వారా యువతిని ప్రపంచానికి ఆదర్శంగా పరిచయం చేస్తోంది.

Also Read:ఉగ్రదాడి..హైదరాబాద్‌లో మాక్‌డ్రిల్

- Advertisement -