- Advertisement -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత లాయర్ గియులియాని కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పోరాడుతూనే ఉంటామని వెల్లడించారు.
న్యూయార్క్ గొప్ప మేయర్‌గా పని చేసిన గియులియాని అమెరికా ఎన్నికల్లో అక్రమాలపై అక్రమాలను బహిర్గతం చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతూ చైనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారని ట్రంప్ ట్వీట్ చేశారు.
గియులియాని వైద్యనిపుణుల సలహాలు పాటించకుండా మాస్క్ లేకుండా తిరిగి కరోనా బారిన పడ్డారు. గియులియాని కుమారుడు ఆండ్రూ వైట్ హౌస్‌లో పనిచేస్తూ గతంలో కరోనా బారిన పడ్డారు. యుఎస్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 14.58 మిలియన్లకు చేరుకుంది. గతంలో ట్రంప్, అతని భార్య మెలానియా, కుమారుడు డొనాల్డ్ జూనియర్, అతని కుమారుడు బారన్, ప్రెస్ సెక్రటరీ, సలహాదారులు, ప్రచార నిర్వాహకులు కరోనా బారినపడ్డారు.
- Advertisement -