దివాళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి:ట్రంప్‌,బైడెన్

220
trump
- Advertisement -

దీపావళి సందర్భంగా ప్రజలకు వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,అమెరికా తదుపలి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌. ఈ దీపావ‌ళి పండుగ‌ ప‌్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాల‌ని ఆకాంక్షించారు. చెడుపై మంచి, చీక‌టిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన ఆధ్యాత్మిక‌ విజ‌యానికి ప్ర‌తీక‌గా ఈ పండుగ జ‌రుపుకుంటామ‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు ట్రంప్‌.

ల‌క్ష‌ల మంది హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధుల‌కు అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ దీపాళి శుభాకాంక్ష‌లు తెలిపారు.సంప్ర‌దాయ పండుగ‌లు ప్ర‌తిఒక్క‌రికి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వ‌ని……కొత్త‌ సంవ‌త్స‌రంలో అంద‌రి జీవితాల్లో ఆనందం, శ్రేయ‌స్సు నిండి ఉండాల‌ని ఆకాంక్షించారు.

చీక‌టిని తొల‌గించి వెలుగు నింపుతుంద‌న్నారు. ‌ప్ర‌తి ఒక్క‌రికి దీపావ‌ళి, సాల్ ముబార‌క్ …అమెరికా, భార‌త్‌తో పాటు ప్ర‌పంచానికి ఈ దీపావ‌ళి కాంతులు నింపాల‌ని ఆంకాంక్షించారు కమలా హ్యారిస్.

- Advertisement -