మోతెరా స్టేడియానికి బయల్దేరిన ట్రంప్ దంపతులు

384
trumpnew
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీ. అనంతరం సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. సబర్మతి ఆశ్రమంలోని పలు ప్రత్యేకతలను ట్రంప్ దంపతులకు వివరించారు ప్రధాని మోదీ. ఆశ్రమంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి నూలు దండ వేసి నమస్కరించారు ట్రంప్ , మోదీ. అనంతరం ఆశ్రమంలో ఉన్న చరఖాతో నూలు వడికారు ట్రంప్, మెలానియా.

నూలు వడకడాన్ని ఆసక్తిగా గమనించారు ట్రంప్ దంపతులు. ఆశ్రమం గురించి పలు విషయాలు ట్రంప్ దంపతులకు వివరించారు. అనంతరం సబర్మతి ఆశ్రమం నుంచి మోతెరా స్టేడియానికి బయల్దేరారు ట్రంప్ దంపతులు.ట్రంప్ దంపతులకు దారికి ఇరువైపులా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. సబర్మతి ఆశ్రమం నుంచి మోతెరా స్టేడియం వరకు రోడ్ షో ను నిర్వహించారు. మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ఆగ్రాకు బయల్దేరనున్నారు. సాయంత్రం 5.15గంటలకు ఆగ్రాకు ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. సాయంత్రం 6.45గంటలకు ఆగ్రానుంచి తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఉదయం 9.55గంటలకు రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 10.45గంటలకు రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధికి ట్రంప్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం 11.25గంటలకు హైదరాబాద్ హౌస్ కు వెళ్లనున్నారు.

Sabarmathi

అనంతరం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ ను సందర్శించనున్నారు ట్రంప్ దంపతులు. రేపు మధ్యాహ్నం 2.55గంటలకు యూఎస్ ఎంబసికి చేరుకోనున్నారు ట్రంప్. రేపు సాయంత్రం 4గంటలకు యూస్ ఎంబసి సిబ్బందితో ట్రంప్ సమావేశంకానున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు హోటల్ మౌర్యాకు చేరుకోనున్నారు ట్రంప్. రేపు రాత్రి 7.25గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు ట్రంప్. రేపు రాత్రి 8గంటలకు ట్రంప్ దంపతలుకు విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి. అనంతరం రాత్రి 10గంటలకు తిరిగి అమెరికాకు పయనం కానున్నారు ట్రంప్ దంపతులు.

- Advertisement -