2021లో అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ట్రంప్ ట్వీట్ చేయడంతో ఆయన అకౌంట్‌ను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను భారీ డీల్‌కు సొంతం చేసుకోగా దీనిపై స్పందించారు ట్రంప్.
ఈ మేరకు ట్రూత్ సోషల్ ద్వారా స్పందించిన ట్రంప్…ట్విట్టర్‌ను మస్క్ దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వ్యక్తి చేతుల్లో ఉంది. దీంతోపాటు అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చిందన్నారు.
ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోవడానికి ట్విట్టర్ కృషి చేయాలని తెలిపారు. ఇక ట్విట్టర్లో దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన మస్క్…తొలగించిన ఖాతాల పునురద్దరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి..