- Advertisement -
కరోనా వైరస్ విషయంలో చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్ సోకడం అమెరికన్ల తప్పుకాదని ఇదంతా చైనా వల్లే జరిగిందన్నారు. ఇక తనకు కరోనా వైరస్ చికిత్స అందించిన డాక్టర్లపై ప్రశంసలు గుప్పించారు ట్రంప్.
కొవిడ్ బారినపడ్డ అమెరిక్లకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తానని వెల్లడించారు. తాను హాస్పిటల్‌లో నాలుగు రోజులు గడిపానని, తక్కువ వ్యవధిలో కోలుకున్నానని తెలిపారు. హాస్పిటల్‌లో రెజెనెరాన్ అనే మందును ఇచ్చారని, దీన్ని తీసుకున్న వెంటనే మంచి అనుభూతిని పొందగాలిగానని వెల్లడించారు ట్రంప్.
జాన్సన్..జాన్సన్, మోడరనా వంటి అనేక కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని…త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు ట్రంప్.
- Advertisement -