మే 25 నుంచి డొమెస్టిక్ విమానాల పునరుద్ధరణ..

201
Minister Hardeep Singh Puri
- Advertisement -

దేశీయ పౌర విమానయాన కార్యకలాపాల పునరుద్ధరణ యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు. తన ప్రకటనను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దేశంలో గత రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.

అయితే, పర్టిక్యులర్ నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మే 25 నుండి కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -