ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న కుక్క (వీడియో )

462
dog-video
- Advertisement -

మనుషులకు ఒంట్లో బాలేకపోతే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకుంటాం. మూగ జీవులు మాత్రం ఆ నొప్పని అలాగే భరిస్తుంటాయి.  కానీ ఇక్కడ ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క కాలిగి దెబ్బ తగలడంతో ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే టర్కీలోని ఇస్తాంబుల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బానూ నెస్ గిజ్ అనే యువతి జంతు ప్రేమికురాలు. ఆమకు స్వతహాగా ఓ ఫార్మసీ ఉంది. తాను ఫార్మసీలో ఉండగా ఓ కుక్క లోపలికి వచ్చింది. దీంతో ఆమె కుక్క దగ్గరికి వెళ్లి పరిశీలించింది. దీంతో తన కాలుకి తగిలిన గాయాన్ని ఆమెకు చూపించింది యువతి.

ఆ కాలుకు రక్తం కారుతోంది. అది గమనించిన ఆమె వెంటనే కుక్క కాలుకి వైద్యం చేసింది. వెంటనే ఆ కాలుకు కట్టు కట్టింది. తర్వాత ఆ కుక్క అక్కడే కాసేపు సేద తీరింది. తర్వాత తేరుకున్న కుక్క.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక.. కుక్క డాక్టర్ తో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న వీడియో, ఫార్మసీ లోపలికి కుక్క వచ్చి తనకు గాయమైన కాలిని చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -